విశ్వం వైపు విద్యార్ధుల అడుగులు

కేంద్రీయ విద్యాలయం నూతన క్యాంపస్ ప్రారంభం  

జిల్లా కేంద్రమైన నిజామాబాద్ ఖిల్లా రామాలయం గా ప్రసిధ్దికెక్కిన చారిత్రాత్మకమైన రఘునాథాలయం సమీపంలో సువిశాల మైన స్థలంలో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయం ప్రాంగణం దేశంలోనే ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుని   ఆ సంస్థ చరిత్రలో నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్రీయ విద్యాలయం నూతన ప్రాంగణాన్ని మంగళవారం నాడు వర్చువల్ గా ప్రారంభించారు. అయోధ్యలో పునర్ నిర్మించిన భవ్యమైన రామాలయంలో  బాలరాముడి ని పునఃప్రతిష్టించిన కార్యక్రమం వైభవంగా ముగిసిన నేపధ్యంలో స్థానికంగా ఆ రాముడి ఆలయానికి సమీపాన కేంద్రీయ విద్యాలయం నూతన క్యాంపస్ ప్రారంభం కావడం యాధృశ్చికమైనా దేశంలోని విద్యార్దులందరూ వర్తమానానికి సంబంధించిన సకల విద్యాలలో  నిష్ణాతులైతే దేశంలో మేధాసంపత్తి వృధ్దిచెంది అది విశ్వకళ్యాణానికి దోహదం చేస్తుందని ఆకాంక్షించని వారెవ్వరు?.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థల ప్రారంభోత్సవాల కార్యక్రమాలను భీష్మ ఏకాదశి రోజున ప్రధాన మంత్రి నిర్వహించడం కూడా యాధృశ్చికమే కావచ్చు కానీ భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామస్తోత్రం పుట్టిన రోజని పిలుస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు భీష్ముల వారు పాండవాగ్రజుడైన ధర్మరాజుకు విష్ణుసహస్ర నామాన్ని ఉపదేశించారు. విష్ణుసహస్రనామ స్తోత్రం విశ్వం విష్ణుం…. అనే నామాలతో ప్రారంభంకాగా అందులోనే విష్ణువును విష్ణుతత్వాన్ని వివరించగా తరువాతి నామాలు అన్ని కూడ మొదట చెప్పిన నామాలకు వ్యాఖ్యానం అంటరూ ప్రసిధ్ది ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. విష్ణు సహస్రనామ పారయాణం అంటే విశ్వాన్ని అధ్యయనం చేయడమే. అంతటి మహత్తరమైన పర్వదినాన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశ వ్యాప్తంగా నూతన విద్యా సంస్థల ప్రాంగణాలు ప్రారంభించడం అపూర్వమైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి విశేషమైన రోజున ప్రారంభమైన కొత్త ప్రాంగణం నుండి విద్యాలయం పనిచేయడం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంకానున్నది. ఇటువంటి విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులు జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపి గరియసి అని చెప్పిన రాముడికి వారుసులు కాకుండా ఏ విధంగా ఉంటారు.? అందుకే నేమో కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు కేంద్ర విద్యాలయం దేశ భక్తులను తయరు చేస్తుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజులలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అయిన ఆశ్ఛర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రీయ విద్యాలయంలో సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తాను ఆర్ధిక వ్యయాన్ని అందజేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ కేంద్ర విద్యాసంస్థలు దేశ వ్యాప్తంగా విస్తరించాలనే కార్యక్రమం వేగంగా సాగుతోందని తెలియజేశారు.     

కాగా నిజామాబాద్ లో రఘునాథ ఆలయానికి స్వాగతం పలికే ద్వారాల (కోట) నుంచి మినీట్యాంక్ బండ్ గా అభివృధ్ది చేసిన రఘునాథ చెరువు పక్క రోడ్డులో సువిశాల ఏడున్నర ఎకరాల స్థలంలో 22 కోట్ల రూపాయల నిధులతో  ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ నూతన ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన దేశ భక్తి , దైవ భక్తి కి సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్దునుల రామ రామ రాఘవా… అన్నరామకథను వివరించే గీతంపై ప్రదర్శించిన నృత్యంలో రామాయణంలోని వివిధ ఘట్టాలకు సంబంధిచి ప్రదర్శించిన  భంగిమలు ప్రత్యక్షంగా రాముల వారి కొలువులోనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నామా అనే అనుభూతి లోనయ్యే విధంగా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. రామసన్నిధిలో లవకుశులు రామకథను గానం చేసారన్నది ప్రచారంలో ఉన్న అంశం, తెలుగు వారి నాటకాలు, సినిమాలలో లవకుశల గానం ప్రేక్షకులను విశేషంగా ఆకర్శించింది. రంజిపజేసింది. ఇప్పటికీ శ్రీరామనవమి రోజున శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…. అన్న పాట ప్రసారం చేయని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ అంటూ ఏది ఉండదు. అదే విధమైన అనుభూతిని విద్యార్దునులు ప్రదర్శించిన రామకథా నృత్య రూపకం వీక్షించిన వారికి కలగడం విశేషం. రాముల వారి బాల్యం నుంచి జరిగిన ముఖ్యమైన రామయణ ఘట్టాలతోపాటు కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి అవతారం కూడా రాముడే అని తెలియజేస్తూ ఆ పాట ముగుస్తుంది. టిటిడి కార్యక్రమాలలో ఈ పాట బహుళ ప్రజాదరణ పొందింది.               

ప్రారంభోత్సవవానికి హాజరైన అతిథులందరూ కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడంలో తెయని ఆత్మానందాన్ని అనుభవించరే మో తెలియదు.కాగా వేదికను అలంకరించిన వారు తమ ప్రసంగాలలో మానసికంగా ధృడత్వాన్ని సాధించేవిధంగా విద్యార్దులకు తర్ఫీదు ఇవ్వడంలో ఉపాధ్యాయలు, తల్లితండ్రులు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. అందుకు సంబంధించి తరగతి గది చదువులతోపాటు ఆట, పాటలతోపాటు ఇతర అంశాలపైన కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా వేదికమైన ఆసీనులైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు విద్యాలయ ప్రాముఖ్యతను వివరిస్తూ వత్తిడి లేని వాతావరణంలో విద్యాను అందించాలన్నదే ప్రభుత్వ అభిమతం అని తెలియజేశారు. రామకథ నృత్యప్రదర్శనతోపాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు అహ్లదకరమైన వాతావరణంలో సాగాయి. ఎండ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *