కవితకు సిబిఐ సమన్లు…

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వచ్చే వారం విచారణ హాజరు కావాల్సిందిగా పార్లమెంట్ మాజీ సభ్యురాలు, బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత కు సిబిఐ సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కవిత కు సిబిఐ నోటీసులు జారీ చేయడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అనుమానితురాలిగా ఉంది.

ఇప్పటికే ఒకసారి కవితను హైదారాబాద్ లోని ఆమె ఇంట్లో సిబిఐ ప్రశ్నించింది. ఆమె ఒకసారి ఢిల్లీలో ఈడి విచారణకు కూడ హాజరయ్యారు. రెండు సందర్భాలలోనూ భారీ నాయకులు, అనుచరగణాల మద్దతు, జయజయ ధ్వానాల  నినాదాల నేపధ్యంలో రెండు విచారణలకు హౌజరయ్యారు. ఈడి అధికారులు ఆరోపిస్తున్నట్టుగా తాను తన వ్యక్తిగత మోబైల్ ఫోన్లను ధ్వసం చేయలేదని తెలియజేసే విధంగా ఆమె తన ఫోన్లతో సహా ఈడి విచారణకు హాజరయ్యారు.

తనకు ఈడి విచారణ ఎదుట హజరు కావడం నుంచి మినహాఇంపు ఇవ్వాలని, ఈడి అధికారులు తనను తన ఇంటివద్దే ప్రశ్నించాలని ఆమె సుప్రింకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రింకోర్టు స్టే ఇవ్వలేదు.

ఇటువంటి నేపధ్యంలో సిబిఐ నోటీసులు జారీ చేయడం బిఆర్ఎస్ లోనూ ఇతర రాజకీయ పార్టీలలోనూ  ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  

కాగా బిఆర్ఎస్ లో కవిత ప్రాధాన్యత తగ్గినట్టుగా కనిపిస్తోంది. గత శాసనసభ ఎన్నికలలో కవిత సేవలను బిఆర్ఎస్ పెద్దగా వినియోగించుకోలేదు. ఆమెకు కామారెడ్డిలో ప్రచారం చేయడానికి అనుమతి లభించలేదు. నిజామాబాద్ , భోదన్ నియోజకవర్గాలపైన ఆమె ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. ఎండ్స్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *