బిజెపిలోకి రేవంత్  -అరవింద్ ఎంపి

ఏబివిపి కార్యకర్త గా ప్రయాణాన్ని ప్రారంభించిన  రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్  రెడ్డి  రానున్న రోజులలో  బిజెపిలో  చేరు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు.

తాను ఇప్పటికే ఆయనను బిజేపీలోకి ఆహ్వానించాను. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాదే తుది నిర్ణయం.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేవైఎం యువజన విభాగం సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఆర్మూర్‌లో జరిగింది.

హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అధికార ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి వేదిక పంచుకున్నారని, మోదీకి పెద్దన్నయ్య అని కొనియాడారని, గుజరాత్‌ తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఆ మరుసటి రోజే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తారని రాహుల్ గాంధీ సంకేతాలు ఇచ్చారు.

ఊహాగానాలకు బలం చేకూర్చే సూచనలను ముఖ్యమంత్రి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి బీజేపీలో చేరతానని అరవింద్ అన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటి అంటూ కాంగ్రెస్‌ విమర్శలను కొనసాగిస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. దీంతో రాష్ట్రంలో బీజేపీని కొంత మేర నియంత్రించిన కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు దేశ, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్న ఉహాగానాలకు ఆస్కారం చిక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపినట్లు రాజకీయ వర్గాల సమాచారం.

ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఆవశ్యకత ఏమిటని, 43 టెంపరేచర్‌లో ఎన్నికల సభలన ఏర్పాటు చేసి విమర్శలు చేయడం అవసరమా అని అరవింద్ ప్రశ్నించారు.  రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఎందుకు విమర్శలు కొనసాగిస్తున్నారని అరవింద్ అన్నారు.

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తుంగలో తొక్కి ముస్లింలకు ప్రవేశ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. తన ఆస్తిలో 50 శాతం ముస్లింలకు పంచాలని, ఆ తర్వాతే బీజేపీపై విమర్శలు కొనసాగించాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అభిప్రాయపడ్డారు.

అటల్ బిహారీ వాజ్‌పే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచారన్నారు. రిజర్వేషన్లపై వివరణలు ఇచ్చిన తర్వాత కూడా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన నకిలీ వీడియోలను స్థానిక నాయకులు మరియు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి అధికారిక ఖాతాల నిర్వహణతో రీపోస్ట్ చేశారు. ఈ విషయమై నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపైన కూడ అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అవినీతికి అక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు అందుకనే ఇటువంటి వ్యవహారాలు చేయడం ఆ పార్టీ నైజం.

టి జీవన్ రెడ్డి 15వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  45 ఏళ్ల రాజకీయ అనుభవంతో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క మంచి పని చేయలేదని అరవింద్ అన్నారు. 74 యేళ్ళ వయసులో సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. గతంలో ఏబీవీపీ కార్యకర్తల రామన్న, గోపన్నలను హత్య చేసిన నిందితులకు టీ జీవన్‌రెడ్డి ఆశ్రయం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్తను ఎదగడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు.

 నియోజకవర్గంలోని ఏబీవీపీ కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరినీ తాను ప్రోత్సహిస్తున్నానని, ఇతర పార్టీల కార్యకర్తలను బీజేపీలోకి తీసుకువస్తున్నాని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నుంచి వచ్చి బీజే అభ్యర్థిగా పోటీ చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *